Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ కీలక సూచన

Google removes 13 apps from playstore over security issues
Advertisement
  • భద్రతా సమస్యలున్న 13 యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్
  • సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకెఫీ నివేదిక ఆధారంగా చర్యలు
  • వినియోగదారులు ఈ యాప్‌లను తమ ఫోన్ల నుంచి తొలగించాలని సూచన
Advertisement
వినియోగదారుల భద్రత దృష్ట్యా గూగుల్..ప్లేస్టోర్ నుంచి పలు హానికారక యాప్‌లను తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే నివేదిక ఆధారంగా మొత్తం 13 యాప్‌లను తొలగించినట్టు వెల్లడించింది. తొలగించిన యాప్‌ల జాబితాను విడుదల చేసిన గూగుల్..వీటిని వినియోగదారులు కూడా తమ ఫోన్ల నుంచి తక్షణం తొలగించాలని సూచించింది. 

ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన యాప్‌లో హెల్త్, గేమింగ్, రాశి ఫలాలు, ప్రొడక్టివిటీకి సంబంధించినవి ఉన్నాయి. మెకెఫీ తెలిపిన వివరాల ప్రకారం, సైబర్ నేరగాళ్లు ఈ యాప్స్ ద్వారా సైబర్ ఇంజినీరింగ్ సాయంతో యూజర్ల ఫోన్లను తమ అధీనంలోకి తీసుకుంటారు. ఆ తరువాత అండ్రాయిడ్ పంపించే అలర్ట్ మెసేజీలను డిసేబుల్ చేస్తారు. అనంతరం, ఫోన్‌లో  ప్రకటనలపై క్లిక్ చేయడం, యూజర్ల బ్యాంకింగ్ వివరాలతో అక్రమలావాదేవీలు నిర్వహిస్తారు. 

గూగుల్ తొలగించిన యాప్స్ ఇవే..
1. Essential Horoscope for Android (om.anomenforyou.essentialhoroscope)
2. 3D Skin Editor for PE Minecraft (com.littleray.skineditorforpeminecraft)
3. Logo Maker Pro (com.vyblystudio.dotslinkpuzzles)
4. Auto Click Repeater (com.autoclickrepeater.free)
5. Count Easy Calorie Calculator (com.lakhinstudio.counteasycaloriecalculator) 
6. Sound Volume Extender (com.muranogames.easyworkoutsathome) 
7. LetterLink (com.regaliusgames.llinkgame) 
8. NUMEROLOGY: PERSONAL HOROSCOPE &NUMBER PREDICTIONS (com.Ushak.NPHOROSCOPENUMBER) 
9. Step Keeper: Easy Pedometer (com.browgames.stepkeepereasymeter) 
10. Track Your Sleep (com.shvetsStudio.trackYourSleep) 
11. Sound Volume Booster (com.devapps.soundvolumebooster)  
12. Astrological Navigator: Daily Horoscope & Tarot (com.Osinko.HoroscopeTaro) 
13. Universal Calculator (com.Potap64.universalcalculator) 
Advertisement
Advertisement
Google
Playstore

More Telugu News