ISRO: ఈ ఏడాదికి గగన్‌యాన్‌గా ఇస్రో నామకరణం

2024 The year of Gaganyaan for ISRO
  • వచ్చే ఏడాది మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్న ఇస్రో
  • ఈ దిశగా 2024లో 12-14 ప్రయోగాలు నిర్వహించనున్న వైనం
  • గగన్‌యాన్ పరీక్షలతో పాటూ పలు ఉపగ్రహాలను ప్రయోగించనున్న ఇస్రో
గగన్‌యాన్ పేరిట మానవ సహిత అంతరిక్ష యాత్రే లక్ష్యంగా దూసుకుపోతున్న ఇస్రో ఈ ఏడాది పలు ప్రయోగాలకు సిద్ధమైంది.  దాదాపు 14 మిషన్లు చేపట్టనున్న ఇస్రో ఈ ఏడాదికి గగన్‌యాన్‌గా నామకరణం చేసింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ విషయాలను వెల్లడించారు. 

గగన్‌యాన్ కోసం ఇస్రో గతేడాది మొదటి టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ నిర్వహించింది. ఈ ఏడాది మరో రెండు అబార్ట్ మిషన్లు నిర్వహిస్తామని సోమనాథ్ వెల్లడించారు. రెండు మానవరహిత మిషన్లు, ఒక హెలికాఫ్టర్ డ్రాప్ టెస్ట్, లాంచ్ ప్యాడ్ అబార్ట్ టెస్టు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉపగ్రహ ప్రయోగాలు కూడా నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. ఇన్‌శాట్-3డీఎస్, భారత యుఎస్ సంయుక్తంగా నిర్మించిన నిసార్, రెండో తరం నావిగేషన్ ఉపగ్రహాలను జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌తో ప్రయోగించనున్నట్టు తెలిపారు. రెండు వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలతో పాటూ పీఎస్ఎల్వీ రాకెట్‌తో పలు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ప్రయోగాలు, ఒక ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం కూడా ఉందని వెల్లడించారు. స్క్రామ్ జెట్ ఇంజిన్ పరీక్ష, రీయూజబుల్ లాంచ్ వెహికల్ పరీక్షలనూ ఈ ఏడాదే నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ISRO
Gaganyaan

More Telugu News