కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడి బలి
- కూకట్ పల్లిలో బైక్ ను ఢీ కొట్టిన కారు
- తీవ్ర గాయాలతో బైకర్ దుర్మరణం
- స్కోడా కారు డ్రైవర్ పై కేసు నమోదు
ఆదివారం తన బైక్ పై హౌసింగ్ బోర్డ్ కాలనీకి వెళ్లాడు. స్నేహితుడితో కలిసి హైదర్ నగర్ వైపు వెళుతుండగా ఓ స్కోడా కారు వీరి బైక్ ను వేగంగా ఢీ కొట్టింది. దీంతో అరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలు, తీవ్ర రక్తస్రావం కారణంగా అరుణ్ స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు, పోలీసులు ఆరోపించారు. స్కోడా కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.