PhD Subjiwala: పీహెచ్ డీ చదివి కూరగాయలు అమ్ముతున్నాడు.. పంజాబ్ లో ‘పీహెచ్ డీ సబ్జీవాలా’

  • పీహెచ్ డీ తో పాటు 4 పీజీలు చేసిన యువకుడు కూరగాయలు అమ్ముతున్న వైనం
  • పదకొండేళ్ల పాటు కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా పాఠాలు బోధించిన డాక్టర్ సందీప్ సింగ్
  • సొంతంగా ట్యూషన్ సెంటర్ తెరవాలని డబ్బు కూడబెడుతున్నట్లు వెల్లడి
Punjab Man With PhD Sells Vegetables To Make Ends Meet

ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు పీజీలు చేశాడు.. న్యాయశాస్త్రంలో పీహెచ్ డీ పట్టా అందుకున్నాడు. అయినా సరైన ఉద్యోగం దొరకక చివరికి ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముకుంటున్నాడు. పంజాబ్ లోని పాటియాలాకు చెందిన డాక్టర్ సందీప్ సింగ్ వింత పరిస్థితి ఇది. పీహెచ్ డీ తో తన పేరు ముందు డాక్టర్ అనే పదం చేరింది తప్ప జేబులోకి నాలుగు డబ్బులు వచ్చే మార్గం చూపించలేకపోయిందని వాపోతున్నాడు. పంజాబ్ యూనివర్సిటిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదకొండేళ్ల పాటు ప్రొఫెసర్ గా విద్యార్థులకు పాఠాలు బోధించినట్లు సందీప్ సింగ్ చెప్పాడు.

అయితే, ఏనాడూ టంచనుగా జీతం అందుకోలేదని, పైపెచ్చు తరచుగా జీతంలో కోత పడేదని చెప్పాడు. దీంతో విసుగుచెంది ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పినట్లు వివరించాడు. పూట గడవడం కోసం సైకిల్ రిక్షాలో ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్మడం మొదలు పెట్టానని సందీప్ సింగ్ చెప్పాడు. ప్రొఫెసర్ గా వచ్చే జీతం కన్నా ఇప్పుడు ఎక్కువే సంపాదిస్తున్నానని, డబ్బులు కూడబెట్టి ఏనాటికైనా సొంతంగా ఓ ట్యూషన్ సెంటర్ తెరుస్తానని వివరించాడు. అన్నట్లు.. సందీప్ సింగ్ పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్ లలో పీజీ పట్టా అందుకున్నాడు. ఇప్పటికీ ఇంకా చదువుతున్నాడు. కూరగాయలు అమ్మడం పూర్తయ్యాక ఇంటికి వెళ్లి పరీక్షలకు చదువుకుంటున్నాడు.

More Telugu News