PM Modi: ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' ఎపిసోడ్ లో ప్రజలకు సందేశం అందించిన మోదీ

  • 2023కి వీడ్కోలు పలుకుతున్న భారత్
  • ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ప్రధాని మోదీ ప్రసంగం
  • భారత్ కు 2023 మధురానుభూతులు అందించిందని వెల్లడి
  • ఇదే స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలని ప్రజలకు పిలుపు
Last episode of PM Modi Mann Ki Baat 2023 message

భారత్ కు 2023 సంవత్సరం అనేక మధురానుభూతులు మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' ఎపిసోడ్ లో తన సందేశాన్ని అందించారు. 

భారత్ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద  ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఈ అంశంపై ప్రజలు లేఖలు రాసి సంతోషాన్ని పంచుకున్నారని వెల్లడించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో 'నాటు నాటు' పాటకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు లభించిన అంశాన్ని కూడా మోదీ తన సందేశంలో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా అందరినీ ఆకట్టుకుందని కొనియాడారు. 

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విశేష స్పందన లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు మోక్షం కలిగిందని, జీ20 సదస్సుకు భారత్ అద్భుతమైన రీతిలో ఆతిథ్యమిచ్చిందని మోదీ తెలిపారు. 

ఇలా భారత్ ఈ ఏడాది ఎన్నో ఘనతలు అందుకుందని... ప్రజలు ఆత్మనిర్భర్, వికసిత భారత్ స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

More Telugu News