Mumbai Attacks: న్యూ ఇయర్ రోజున ముంబైని పేల్చేస్తున్నాం.. అగంతకుడి హెచ్చరికలతో ఆర్థిక రాజధాని అప్రమత్తం

  • పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించిన అగంతకుడు
  • నగరంలో వరుస పేలుళ్లకు పాల్పడుతున్నట్టు హెచ్చరిక
  • ముమ్మరంగా తనిఖీలు చేసిన పోలీసులు
  •  అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు 
Caller threatens serial blasts in Mumbai amid New Year celebrations

నూతన సంవత్సరం రోజున వరుస పేలుళ్లతో ముంబైలో విధ్వంసం సృష్టించనున్నట్టు ఓ అగంతకుడు ఫోన్ చేయడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్న వేళ ఈ కాల్ రావడంతో నగర వాసుల్లో ఆందోళన మొదలైంది. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ముంబై పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి  న్యూ ఇయర్ రోజున వరుస పేలుళ్లకు పాల్పడుతున్నట్టు చెప్పి ఫోన్ పెట్టేశాడు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News