పంత్ యాక్సిడెంట్ వార్త తెలిశాక కొన్ని క్షణాలపాటు భయం వెంటాడింది: అక్షర్ పటేల్
- ఆ రోజు ఉదయం తన సోదరి ఫోన్ చేసి చెప్పిందన్న క్రికెటర్
- సరిగ్గా గతేడాది డిసెంబర్ 30న డెహ్రడూన్ దగ్గర్లో ప్రమాదం
- కారు బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్
‘పంత్ తో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడావని ప్రతిమ దీదీ అడిగితే నిన్న మాట్లాడాలని ప్రయత్నించా కానీ కుదరలేదని చెప్పాను. వెంటనే పంత్ అమ్మగారి ఫోన్ నెంబర్ ఉంటే పంపించు అనడంతో ఎందుకని అడిగా. పంత్ కు యాక్సిడెంట్ అయిందని ప్రతిమ దీదీ చెప్పడంతో షాక్ కు గురయ్యా. ఒక్కసారిగా భయం ఆవరించింది. పంత్‌కు ఏదో జరిగిపోయిందని భావించా’ అని అక్షర్ పటేల్ భావోద్వేగానికి గురయ్యాడు.