Heart Attack: క్రికెట్ ఆడిన తర్వాత చల్లని నీళ్లు తాగి కుప్పకూలి మరణించిన పదో తరగతి కుర్రాడు!

Uttar Pradesh teen drinks water after playing cricket and dies
  • ఉత్తరప్రదేశ్‌లోని అల్మోరా జిల్లాలో ఘటన
  • స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడిన కుర్రాడు
  • మ్యాచ్ ముగిశాక నీళ్లు తాగి కుప్పకూలి మరణించిన వైనం
  • గుండెపోటే కారణమని అనుమానం
క్రికెట్ ఆడిన తర్వాత నీళ్లు తాగిన ఓ కుర్రాడు ఆ వెంటనే కుప్పకూలి మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని అల్మోరా జిల్లాలో జరిగిందీ విషాద ఘటన. హసాన్‌పూర్‌లోని కాయస్తాన్‌కు చెందిన 17 ఏళ్ల ప్రిన్స్ సైనీ పదో తరగతి చదువుతున్నాడు. నిన్న స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే చల్లని నీళ్లు తాగిన ప్రిన్స్ ఆ వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు.

అది చూసి గాభరాపడిన అతడి స్నేహితులు విషయాన్ని వెంటనే అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు వెంటనే వచ్చి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రిన్స్ మరణించినట్టు నిర్ధారించారు. కుర్రాడి మృతికి గుండె పోటే కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు.
Heart Attack
Cricket
Uttar Pradesh

More Telugu News