Google: కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ గూగుల్ సరికొత్త డూడుల్

Google New Year Doodle

  • యానిమేటెడ్ డూడుల్ ను షేర్ చేసిన కంపెనీ
  • 2024 ఏడాదికి స్వాగతం చెబుతూ వినూత్న డూడుల్
  • గతేడాది జ్ఞాపకాలను.. కొత్త ఏడాది ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపకల్పన

2023 ఏడాదికి గుడ్ బై చెబుతూ 2024 కు స్వాగతం పలుకుతూ ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సరికొత్త డూడుల్ ను ప్రదర్శించింది. సందర్భానుసారంగా వినూత్న డూడుల్ ను ప్రదర్శించే గూగుల్.. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా యానిమేటెడ్ డూడుల్ కు రూపకల్పన చేసింది. గతేడాది తీపి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ.. రాబోయే ఏడాదికి సంబంధించిన ఆకాంక్షలను ప్రతిఫలించేలా తయారుచేసింది.

ఈ యానిమేటెడ్ డూడుల్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రముఖుల జయంతి, వర్ధంతి సహా పలు ప్రత్యేక సందర్భాలలో వినూత్న డూడుల్స్ తో వారికి నివాళులు తెలియజేయడం గూగుల్ ఆనవాయితీగా కొనసాగిస్తోంది. దీంతో పాటు న్యూఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు తాజాగా ఈ సరికొత్త డూడుల్ ను రూపొందించింది.

More Telugu News