JC Prabhakar Reddy: టీడీపీ నేతలు నన్ను కెలికితే ఈ భూమ్మీదే లేకుండా చేస్తా: జేసీ బ్రదర్స్ వ్యక్తిగత న్యాయవాది హెచ్చరిక

JC Brothers Personal Lawyer Srinivasulu Joined In YSRCP
  • కేతిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన శ్రీనివాసులు
  • అధికార పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టాలని ఒత్తిడి తీసుకురావడం వల్లే పార్టీ మారానని వెల్లడి
  • జేసీ టెండర్లు అడ్డుకుంటున్నారన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి
టీడీపీ నాయకులు ఎవరైనా తనను కెలికితే ఒక్కరు కూడా ఈ భూమ్మీద మిగలరని జేసీ సోదరుల వ్యక్తిగత న్యాయవాది, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసులు హెచ్చరించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో నిన్న ఆయన వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసీ ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి పనులను అడ్డుకోవడం, అధికార పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టాలని ఒత్తిడి తీసుకురావడం వల్లే వైసీపీలో చేరినట్టు తెలిపారు. 

ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి ప్రజలకు నిత్యం తాగునీరు అందించేందుకు అమృత్ పథకం ద్వారా రూ. 63 కోట్లు తీసుకొస్తే కౌన్సిల్‌లో అమోదించలేదని విమర్శించారు. టెండర్లను కూడా జేసీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
JC Prabhakar Reddy
JC Diwakar Reddy
MLA Kethireddy
Tadiparti

More Telugu News