metro rail: హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు శుభవార్త... రేపు అర్ధరాత్రి దాకా రైలు

Good News to Hyderabadies on Metro train
షార్ట్స్‌లో చూడండి
న్యూఇయర్ వేడుకలు జరుపుకునే హైదరాబాదీలకు హైదరాబాద్ మెట్రో రైల్ శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు రైళ్లను నడపాలని మెట్రో రైల్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31, ఆదివారం రాత్రి హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించినట్లు తెలిపింది. రేపు అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతున్నామని మెట్రో రైలు ఎండీ వెల్లడించారు. చివరి రైలు ఆయా స్టేషన్ల నుంచి 12.15 నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ రైలు గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపారు.
Go Back to Shorts
metro rail
Telangana
new year 2024

More Telugu News