ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని
- తెలంగాణ ఉద్యమం సమయంలో డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళిని
- ఇటీవల నళినికి అదే ఉద్యోగం లేదా ఆ స్థాయి ఉద్యోగం ఆఫర్ చేసిన ముఖ్యమంత్రి
- సున్నితంగా తిరస్కరించిన నళిని
- నేడు సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నళిని
పోలీసు అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న నళినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని లేదంటే అదే స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. కానీ తాను ప్రస్తుతం పూర్తి ఆధ్యాత్మిక చింతనతో ఉన్నానని.. తాను ఫిట్ కూడా కాదని.. అందుకే ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు నళిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.