Narendra Modi: ఈ ట్రెండ్‌కు నేనే మంచి ఉదాహరణ: ప్రధాని మోదీ

  • మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో సీఎంలుగా కొత్త వ్యక్తులపై మోదీ స్పందన
  • కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం బీజేపీలో ఎప్పుడూ ఉన్నదేనని వ్యాఖ్య
  • పరిపాలన అనుభవం లేకుండానే తాను తొలిసారి సీఎం అయిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ
  • కొత్త తరానికి అవకాశాలు రావడం ప్రాజాస్వామ్యానికి కీలకమని వ్యాఖ్య
Narendra modi on choosing new faces as cms for madhyapradesh Chhattisgarh Rajasthan

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రుల ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఇది కొత్త ట్రెండ్ కాదని వివరించారు. గతంలో చాలా సార్లు బీజేపీలో ఇలా జరిగిందని, ఇందుకు మంచి ఉదాహరణ తానేనని చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రాజకీయ ఉద్దండులను కాదని, కొత్తవారిని సీఎం పదవికి ఎంపిక చేయడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. 

ఈ పరిణామాలపై జాతీయ మీడియాతో మోదీ పలు విషయాలు పంచుకున్నారు. ‘‘బీజేపీలో ఎప్పటినుంచో ఉన్న ఈ ట్రెండ్‌కు నేనే మంచి ఉదాహరణ. నేను గుజరాత్‌ సీఎం అయ్యేనాటికి నాకు పరిపాలన అనుభవం లేదు. అప్పటికి నేను అసెంబ్లీకి కూడా ఎన్నిక కాలేదు’’ అని మోదీ చెప్పారు. 2001లో కేశూభాయ్ పటేల్ తరువాత గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలను మోదీ స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాలుగు నెలలకు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 

బీజేపీ కేడర్ ఆధారిత పార్టీ అని, వివిధ రకాల ప్రయోగాలు చేయడం పార్టీకి అలవాటేనని తెలిపారు. ‘‘ఒకేసారి పలు తరాల నాయకత్వాన్ని ప్రోత్సహించే సామర్థ్యం బీజేపీకి ఉంది. పార్టీ అధ్యక్షులుగా కొన్నేళ్లకు కొత్త వారు వస్తుంటారు. కొత్త తరానికి అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకం’’ అని తెలిపారు.

More Telugu News