అయోధ్య ఎయిర్‌పోర్టుకు ‘మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టు’గా నామకరణం
- ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయోధ్య ధామ్’గా కొత్త పేరు ప్రకటన
- గతంలో ఉన్న ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’ పేరు మార్పు
- రేపు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
శనివారం (డిసెంబర్ 30) నుంచే ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇక్కడ సర్వీసులు ప్రారంభించబోతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి. జనవరి నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయని వెల్లడించాయి. కాగా దాదాపు రూ.1,450 కోట్ల అంచనాతో విమానాశ్రయం మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కొత్త టెర్మినల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. పీక్-అవర్‌లో 600 మంది ప్రయాణికులకు వసతులు అందించగలిగేలా నిర్మించారు.
కాగా ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయిలో ఎయిర్‌పోర్టును రూపొందించారు. ఇక రెండవ దశ అభివృద్ధిలో 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. రద్దీ సమయాల్లో 3,000 మంది ప్రయాణికులకు, ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యంతో నిర్మించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.