Plane in Cross winds: భారీ తుపాను.. ల్యాండింగ్‌లో ఊగిపోయిన విమానం.. వీడియో ఇదిగో!

Boeing 777 Makes Insane Landing At London Airport Amid High Winds
  • గెరిట్ తుపాను సమయంలో లండన్ ఎయిర్‌‌పోర్టులో విమానం ల్యాండింగ్
  • గాలులు తీవ్రంగా ఉండటంతో ఊగిపోయిన విమానం
  • పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా దించిన వైనం
తుపాను గాలుల కారణంగా లాండింగ్‌లో అటు ఇటు ఊగిపోయిన ఓ విమానం వీడియో నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం గెరిట్ తుపాను కారణంగా బ్రిటన్ అతలాకుతలమైంది. 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తుండటంతో పలు విమాన, రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం తుపాను గాలుల మధ్య ల్యాండయ్యే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. రన్‌వేపై దిగే క్రమంలో విమానం రెక్కలు అటూ ఇటూ కదులుతూ దాదాపుగా నేలను తాకినంత పనిచేశాయి. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా కిందకు దింపాడు.
Plane in Cross winds
London
Viral Videos

More Telugu News