Couple: స్టేడియంలో ఓ జంట ప్రణయాన్ని బట్టబయలు చేసిన కెమెరామన్... వీడియో ఇదిగో!

  • మెల్బోర్న్ లో ఆసీస్, పాక్ రెండో టెస్టు
  • గ్యాలరీలో ప్రేక్షకులు లేని చోట కూర్చున్న ఓ జంట
  • వారు ప్రేమావేశంలో ఉండగా ఫోకస్ చేసిన కెమెరామన్
  • బిగ్ స్క్రీన్ పై తమను తాము చూసుకుని దిగ్భ్రాంతికి గురైన జంట
Couple spotted in love making at MCG

మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుండగా, స్టేడియంలో ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా, స్టేడియంలోని భారీ తెరపై ఓ జంట ప్రణయం బట్టబయలైంది. 

పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... ప్రేక్షకులు లేని గ్యాలరీలోకి వెళ్లి కూర్చున్న ఆ జంటను కెమెరామన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశాడు. ప్రేమావేశంలో ఊసులాడుకుంటున్న ఆ యువతి, యువకుడు ఒక్కసారిగా టెలివిజన్ తెరపై తమను తాము చూసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. 

ఊహించని పరిణామంతో సిగ్గుపడిన ఆ యువకుడు ముఖం దాచుకుని వెళ్లిపోవడం తెరపై కనిపించింది. బిగ్ స్క్రీన్ పై ఈ సీన్ కనిపించగానే మైదానంలో ఈలలు, కేకలు మిన్నంటాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దర్శనమిస్తోంది.

More Telugu News