Raghavendra Rao: నా కాలేజ్ డేస్ ఎలా నడిచాయంటే ..: రాఘవేంద్రరావు

Raghavendra Rao Interview
  • కాలేజ్ చదువు చెన్నైలో సాగిందన్న రాఘవేంద్రరావు
  • అప్పట్లో యూత్ ఇంత ఫాస్టుగా లేదని వ్యాఖ్య 
  • తాను ఎవరినీ లవ్ చేయలేదని వెల్లడి 
  • ఈ జనరేషన్ లో బ్రేకప్ లు ఎక్కువని వివరణ  
తెలుగు సినిమాను పవర్ఫుల్ గా .. తెలుగు పాటను కలర్ఫుల్ గా  ఆవిష్కరించిన దర్శకుడు రాఘవేంద్రరావు. తాజాగా ఆయన ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " నా కాలేజ్ రోజులన్నీ చెన్నైలో గడిచాయి. అప్పట్లో ఈ ఫోన్లు లేవు .. యూత్ ఇంత ఫాస్టుగా ఉండేది కాదు" అని అన్నారు. 

" అప్పట్లో ప్రేమలోపడితే లెటర్ రాయడం .. ఆ లెటర్ ఆమెకి చేరిందో లేదో చూసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్. ఈ తలకాయ నొప్పంతా నాకు ఎందుకు అనుకునేవాడిని. ఇష్టమైన వాళ్లు కనిపిస్తే మాట్లాడేవాడిని. స్నేహితులతో కలిసి పిట్టగోడలపై కూర్చుని .. రోడ్డుపై వెళుతున్న అమ్మాయిలను చూసేవాడిని. అంతే తప్ప ఎవరితో లవ్ ఎఫైర్ లేదు" అని చెప్పారు. 

"ఇక పెళ్లిళ్ల విషయానికి వస్తే, అప్పట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. అందువలన విడిపోవడమనే సంఘటనలు చాలా తక్కువగా జరిగేవి. ఇప్పుడు .. ఈ జనరేషన్ లో చాలా చిన్న చిన్న విషయాల దగ్గర విడిపోతున్నారు. కోట్ల రూపాయలను ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నవారు కూడా ఏడాది తిరిగే సరికి విడిపోతున్నారు" అని అన్నారు.
Raghavendra Rao
Director
Tollywood

More Telugu News