ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత
- చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ఆయన వయసు 71 సంవత్సరాలు
- ఈ ఉదయం ఆయనకు కరోనా నిర్ధారణ అయిన వైనం
జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు తదితర సమస్యలతో గత నెలలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలోనే ఆయన చనిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కదలలేని స్థితిలో, చాలా బలహీనంగా కనిపించారు. తాజాగా మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. అయనకు కరోనా సోకినట్టు ఈ ఉదయం వైద్య పరీక్షల్లో నిర్ధరాణ అయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి, చికిత్సను కొనసాగించారు. అయితే, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి విషమించి కన్నుమూశారు.