Mahesh Babu: 'గుంటూరు కారం' నుంచి మహేశ్ మాస్ స్టెప్ పోస్టర్!

  • 'గుంటూరు కారం' కోసం మహేశ్ ఫ్యాన్స్ వెయిటింగ్ 
  • జనవరి 12వ తేదీన పాన్ ఇండియా రిలీజ్
  • అంచనాలు పెంచేసిన అప్ డేట్స్  
  •  సందడి చేయనున్న శ్రీలీల - మీనాక్షి చౌదరి 

Gunturu Karam Movie Update

మహేశ్ బాబు మాస్ యాక్షన్ మూవీ చేయక చాలా కాలమే అయింది. పక్కా మాస్ కంటెంట్ తో ఆయన నుంచి ఒక సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను త్రివిక్రమ్ సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాక చాలా కాలం కావడంతో మరింత ఆసక్తిని కనబరిచారు. 

అయితే ఈ సినిమాకి త్రివిక్రమ్ 'గుంటూరు కారం' అనే టైటిల్ ను సెట్ చేశాడు. నిజానికి ఈ మధ్య వచ్చిన త్రివిక్రమ్ సినిమాలను చూసుకుంటే, ఇది పూర్తిగా భిన్నమైన టైటిల్. మహేశ్ బాబు కూడా ఇలాంటి మాస్ టైటిల్ తో ఈ మధ్య రాలేదు. దాంతో సహజంగానే ఈ సినిమా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. హారిక - హాసిని బ్యానర్ పై ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. 

తాజాగా ఈ సినిమా నుంచి మహేశ్ బాబు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహేశ్ పై చిత్రీకరించిన మాస్ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ఇది. ఈ పోస్టర్ ను చూస్తుంటే 'పోకిరి'లోని మహేశ్ బాబు లుక్ గుర్తుకు రాకుండా ఉండదు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, మహేశ్ సరసన శ్రీలీల - మీనాక్షి చౌదరి సందడి చేయనున్నారు.

More Telugu News