Devil: ఆ ఒక్క ప్రశ్నకి మాత్రం నేను సమాధానం చెప్పను: హీరో కల్యాణ్ రామ్

Kalyanram Interview
షార్ట్స్‌లో చూడండి
కల్యాణ్ రామ్ హీరోగా 'డెవిల్' సినిమా రూపొందింది. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి, దర్శకుడిగా నవీన్ మేడారం పేరు వినిపించింది. ఆ తరువాత ఎక్కడా ఆ ప్రస్తావన లేదు. నవీన్ మేడారం ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయినా, ఆ విషయాన్ని దాచి ఉంచడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్న, 'గ్రేట్ ఆంధ్ర' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ కి ఎదురైంది. 

అందుకు కల్యాణ్ రామ్ స్పందిస్తూ .. "ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకు? ఏం జరిగింది? అనేది అభిషేక్ నామాగారి నోటి వెంట వింటే బాగుంటుంది. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆయన మాత్రమే చెప్పగలడు" అంటూ ఆయన ఆ విషయాన్ని దాటేశాడు. 

"ఇక ఈ సినిమాను 29వ తేదీన రిలీజ్ చేయడానికి కారణం ఉంది. 1వ తేదీన సెలవు కావడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పబ్లిసిటీకి ఎక్కువ సమయం లేదనే టెన్షన్ మాకు లేదు. ఎందుకంటే ట్రైలర్ నచ్చితే జనాలు థియేటర్స్ కి వస్తున్నారు. కంటెంట్ బాగుంటే మౌత్ టాక్ జనాలను థియేటర్స్ కి రప్పిస్తోంది" అని కల్యాణ్ రామ్ చెప్పాడు.
Go Back to Shorts
Devil
Kalyan Ram
Samyuktha Menon

More Telugu News