ఎల్లుండి నుంచి దరఖాస్తులు తీసుకుంటాం: మంత్రి కొండా సురేఖ
- ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్న మంత్రి సురేఖ
- అధికారులు విధులలో అలసత్వం వహించవద్దని సూచన
- విపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రజాపాలనలో పాల్గొనాలన్న కొండా సురేఖ
ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ అనంతరం వాటిని పరిశీలించి అర్హులకు పథకాలను అందిస్తామన్నారు. తమలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇక నుంచి మీడియా స్వేచ్ఛగా పని చేయవచ్చునని సురేఖ అన్నారు.