Peethala Sujatha: అంగన్వాడీ కార్యకర్తను లైంగికంగా వేధించిన వైసీపీ నేతలను కఠినంగా శిక్షించాలి: పీతల సుజాత

Peethala Sujatha reacts to Anganvadi worker incident
  • రంగంపేటలో అంగన్వాడీ కార్యకర్తను వేధించారన్న పీతల సుజాత
  • నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
  • బాధితురాలికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా
రంగంపేటలో అంగన్వాడీ కార్యకర్తను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. అంగన్వాడీ కార్యకర్తను లైంగికంగా వేధించిన వైసీపీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ అండగా ఉంటుందని పీతల సుజాత స్పష్టం చేశారు. 

వైసీపీ పాలనలో దళితులకు, మహిళలకు రక్షణ కరవైందని విమర్శించారు. రాష్ట్రంలో అంగన్వాడీల నిరసన దీక్షను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీతల సుజాత ఆరోపించారు. అంగన్వాడీల జీతాలను పెంచిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.
Peethala Sujatha
Anganvadi Worker
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News