Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు యువతి కుట్ర

Woman conspiracy revealed against ex boyfriend
Advertisement
  • మాజీ ప్రియుడిపై కోపం పెంచుకున్న యువతి
  • స్నేహితుల సాయంతో అతడిని పబ్ కు పిలిపించిన వైనం
  • గంజాయి కొని అతడి కారులో పెట్టిన యువతి
  • పబ్ లో గంజాయి అమ్ముతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు
  • పోలీసుల ప్రాథమిక విచారణలో బట్టబయలైన యువతి పన్నాగం
Advertisement
హైదరాబాదులో మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు రింకీ అనే యువతి కుట్ర పన్నిన వైనం వెల్లడైంది. పబ్ కు రావాలంటూ ఆ యువతి మాజీ ప్రియుడు శ్రవణ్ ను స్నేహితుల ద్వారా పిలిపించింది. యువకుడికి తెలియకుండా అతడి కారులో రింకీ గంజాయి ప్యాకెట్లు పెట్టింది. రింకీ రూ.4 వేలతో 40 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసింది. ఒక్కొక్క దాంట్లో 5 గ్రాముల చొప్పున 8 ప్యాకెట్లను మాజీ ప్రియుడి కారులో పెట్టింది. 

అనంతరం, మాజీ ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి రింకీ జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ కు వెళ్లింది. అందరూ పబ్ లో ఎంజాయ్ చేస్తుండగా, రింకీ పోలీసులకు ఫోన్ చేసింది. శ్రవణ్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. 

దాంతో, ఆ పబ్ లోకి వెళ్లిన పోలీసులు గంజాయిపై ఆరా తీశారు. ప్రాథమిక విచారణలో ఇదంతా రింకీ పన్నాగమేనని గుర్తించారు. రింకీ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement
Rinky
Sravan
Ganja
Jubilee Hills
Pub
Police
Hyderabad

More Telugu News