మూడు రోజులపాటు పవన్ కాకినాడలో మకాం.. సమీక్ష!
- 28 నుంచి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష
- నేటి సాయంత్రం ఖరారు కానున్న టూర్ షెడ్యూల్
- సమీక్ష తర్వాత జనసేన పోటీపై స్పష్టత
జనసేనాని సమీక్ష తర్వాత కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నియోజక వర్గాలలో పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయనుందనే విషయంపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 28, 29, 30 తేదీలలో పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటిస్తారు. ఆయన పర్యటనపై జనసేన వర్గాలతో పాటు మిగతా పార్టీ నేతల్లోనూ ఆసక్తి నెలకొంది.