తమ కూతుర్ని తొలిసారి మీడియాకు చూపించిన రణ్‌బీర్ కపూర్- అలియా భట్ దంపతులు.. ఫొటో ఇదిగో
- ఏడాదిన్నర తర్వాత తొలిసారి చిన్నారి ‘రహా’ని పరిచయం చేసిన బాలీవుడ్ కపుల్
- తెల్లటి గౌనులో ముద్దు ముద్దుగా కనిపించిన చిన్నారి
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియోలు
కాగా రణ్‌బీర్ కపూర్ - అలియా భట్ గతేడాది ఏప్రిల్ 14న వివాహబంధం ద్వారా ఒక్కటయ్యారు. గతేడాది నవంబర్ 6న ‘రహా’కు జన్మనిచ్చింది. అయితే దాదాపు ఏడాదిన్నరపాటు పాపను బయట ప్రపంచానికి చూపించలేదు. ఫొటోలు, వీడియోలను షేర్ చేయలేదు. తొలిసారి సోమవారమే విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పాప ముద్దుగా ఉందని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.