Vijayashanti: ఇదీ పనితనం!: రేవంత్ రెడ్డితో పోలుస్తూ కేసీఆర్‌కు విజయశాంతి చురక

Vijayashanti compares former cm kcr with CM Revanth Reddy
  • సెలవు రోజులతో పాటు పని దినాలనూ కేసీఆర్ సెలవులుగా వాడుకున్నాడని విమర్శ
  • రేవంత్ రెడ్డి సెలవు రోజుల్లోనూ ప్రజల కోసం పని చేస్తున్నాడని ట్వీట్
  • లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్ల వరకు గెలుస్తుందని ధీమా
మాజీ మఖ్యమంత్రి కేసీఆర్‌ను... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోలుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి చురక అంటించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి సెలవు దినం రోజున కూడా పని చేస్తున్నారని, కానీ కేసీఆర్ పనిదినం రోజున కూడా సెలవు తీసుకున్నారని విమర్శలు గుప్పించారు.

'పని దినాలు సెలవు దినాలుగా, సెలవు దినాలు ఎట్లానూ.. సెలవు దినాలుగా నడిచిన గత సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం... పని దినాలు పని చేసే దినాలుగా.. సెలవు దినాలు కూడా ప్రజల కోసం, అవసరమైనప్పుడు పని చెయ్యాల్సిన దినాలుగా నడుస్తున్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారు' అని పేర్కొన్నారు. ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో కనిపిస్తుందని, సుమారు 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Vijayashanti
Revanth Reddy
KCR
Telangana

More Telugu News