ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం: కొండా సురేఖ
- ఈ నెల 31 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన ఉంటుందన్న కొండా సురేఖ
- ఈ ప్రజాపాలనలో ప్రజలు తమ సమస్యలు వెల్లడించాలని సూచన
- అర్హులైన వారిని ఎంపిక చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న మంత్రి
పర్యటన సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రజాపాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన ద్వారా పేదలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ప్రజలంతా వారి వారి డివిజన్లలో... వారి వారి గ్రామాల్లో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. వాటిని ఆన్ లైన్ చేసి... వెరిఫికేషన్ చేసి.. అర్హులైన వారిని ఎంపిక చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.