బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మరో ముగ్గురి అరెస్టు
- అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల వాహనాలపై దాడి కేసు
- ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- రెండు రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్
మరోవైపు, పల్లవి ప్రశాంత్ కు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. కొన్ని రోజుల పాటు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని సూచించింది. బెయిల్ పై బయట ఉన్న ప్రశాంత్ ప్రస్తుతం తన ఊరిలో ఉన్నాడు.