Ana Konidela: అనాథ బాలలతో ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న పవన్ కల్యాణ్ అర్ధాంగి అనా

- హైదరాబాదులోని జీవోదయ చిల్డ్రన్ హోమ్ కు వెళ్లిన అనా కొణిదెల
- అక్కడి చిన్నారుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు
- చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధులు తెలుసుకున్న వైనం
- అనా కొణిదెలను సత్కరించిన హోమ్ నిర్వాహకులు
జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అర్ధాంగి అనా కొణిదెల అనాథ బాలల నడుమ ప్రీ క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. అనా కొణిదెల ఇవాళ హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ అనాథ శరణాలయానికి వెళ్లారు. అక్కడి చిన్నారులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. అనాథ బాలలతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. అనాథాశ్రమం నిర్వాహకులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ అర్ధాంగిని జీవోదయ చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.



