Incharge: కరీంనగర్ కు ఉత్తమ్ కుమార్... ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి... జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం

Incharge ministers appointed for districts in Telangana
  • జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి
  • 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జిల ప్రకటన
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించారు. 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 

హైదరాబాద్ జిల్లాకు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు, కరీంనగర్ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు దామోదర రాజనర్సింహ, నల్గొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్  జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, మెదక్ జిల్లాకు కొండా సురేఖను ఇన్చార్జిలుగా నియమించారు.
Incharge
Ministers
Districts
Telangana
Revanth Reddy
Congress

More Telugu News