Christmas: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu and Pawan Kalyan wishes Christians on Christmas
  • రేపు క్రిస్మస్
  • ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న క్రైస్తవులు
  • క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామన్న చంద్రబాబు
  • క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఎల్లప్పుడూ ఆచరణీయమన్న పవన్
రేపు (డిసెంబరు 25) క్రిస్మస్ పర్వదినం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. 

"క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం, అందరినీ సమదృష్టితో చూడడం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

అటు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, క్షమాగుణాలను తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన ఏసు క్రీస్తు జన్మించిన పర్వదినం క్రిస్మస్ అని వివరించారు. 

"ఈ పవిత్ర పండుగ తరుణంలో క్రైస్తవ మత ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సామాజిక విలువలు చైతన్యం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఎల్లప్పుడూ ఆచరణీయం. ప్రతి మనిషి ఎంతో కొంత పరోపకార గుణం అలవరుచుకోకపోతే జీవితానికి అర్థం ఉండదని క్రైస్తవం బోధిస్తుంది. ఈ క్రిస్మస్ పర్వదినాన దేశ ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ నా పక్షాన, జనసేన శ్రేణుల తరఫున మనసారా కోరుకుంటున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Christmas
Christians
Chandrababu
Pawan Kalyan
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News