ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు
- కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్
- నేడు ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులు
- అనంతరం ప్రత్యేక ప్రార్థనలు
సీఎం జగన్ నివాళులు అర్పించిన అనంతరం ఇడుపులపాయ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలకు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం నుంచి సింహాద్రిపురంలో పర్యటించి వివిధ ప్రారంభోత్సవాలకు హాజరుకానున్నారు.
సీఎం జగన్ ప్రతి ఏడాది క్రిస్మస్ కు ఇడుపులపాయ వస్తారని తెలిసిందే. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరుకానున్నారు.


