Priyanka Gandhi: ప్రియాంక గాంధీని యూపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్ఠానం

AICC relieves Priyanka Gandhi from Uttar Pradesh Incharge responsibilities
  • ఇప్పటివరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యూపీ ఇన్చార్జిగా ఉన్న ప్రియాంక
  • తాజాగా కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు
  • యూపీ నూతన ఇన్చార్జిగా సీనియర్ నేత అవినాశ్ పాండే నియామకం
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగానూ కొనసాగారు. తాజాగా, కీలక నియామకాలు చేపట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రియాంక గాంధీని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. ఆమె స్థానంలో అవినాశ్ పాండేని యూపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమిస్తూ హైకమాండ్ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 

అవినాశ్ పాండే మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నేతగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 2010లో ఆయన రాజ్యసభకు కూడా వెళ్లారు.
Priyanka Gandhi
Incharge
Uttar Pradesh
Congress
General Secretary
AICC
India

More Telugu News