Haris Rauf: బిగ్ బాష్ లీగ్ లో ప్యాడ్లు కట్టుకోకుండానే బ్యాటింగ్ కు దిగిన పాక్ ఆటగాడు... వీడియో ఇదిగో!

  • బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్
  • ఆఖరి ఓవర్ లో 4 వికెట్లు కోల్పోయిన మెల్బోర్న్
  • అప్పటికి 19.5 ఓవర్లు పూర్తి... మరొక్క బంతి మిగిలున్న వైనం
  • టైమ్ వేస్ట్ కాకుండా ప్యాడ్లు కట్టుకోకుండానే వచ్చిన హరీస్ రవూఫ్
Pakistan cricketer comes to crease without pads

ఆస్ట్రేలియాలో నిర్వహించే టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సాధారణంగా, క్రికెట్లో బ్యాట్స్ మన్ అన్న తర్వాత ప్యాడ్లు కట్టుకోవాల్సిందే. కాళ్లకు బంతి తగిలి గాయాలు కాకుండా ప్యాడ్లు అడ్డుకుంటాయి. అయితే, బిగ్ బాష్ లీగ్ లో మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆటగాడు ప్యాడ్లు లేకుండా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఆ ఆటగాడు ఎవరో కాదు... హరీస్ రవూఫ్. పాకిస్థాన్ కు చెందిన ఎక్స్ ప్రెస్ పేస్ బౌలర్ హరీస్ రవూఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. రవూఫ్ బిగ్ బాష్ లీగ్ లో మెల్బోర్న్ స్టార్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

సిడ్నీ థండర్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా... మెల్బోర్న్ జట్టు చివరి ఓవర్ లో 4 వికెట్లు కోల్పోయింది. అప్పటికి 19.5 ఓవర్లు పూర్తయ్యాయి. మరొక్క బంతి మిగిలుండడంతో హరీస్ రవూఫ్ ప్యాడ్లు కట్టుకోకుండానే బ్యాటింగ్ కు వచ్చాడు. బ్యాటింగ్ కు వచ్చినా, అతడు నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉండాల్సి వచ్చింది. చివరి బంతిని ఎదుర్కొనే అవకాశం మరో బ్యాట్స్ మన్ కు లభించింది. తాను బరిలో దిగినా ఎలాగూ తనకు బ్యాటింగ్ చేసే అవకాశం రాదని తెలిసే, టైమ్ వేస్ట్ కాకుండా హరీస్ రవూఫ్ ప్యాడ్లు లేకుండానే క్రీజు వద్దకు వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News