TDP: కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిసిన టీడీపీ, జనసేన నేతలు

TDP and Janasena leaders met EC Officials in Vijayawada
  • ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు
  • విజయవాడలో కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిసిన టీడీపీ, జనసేన నేతలు
  • పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు
రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల బృందాన్ని నేడు టీడీపీ, జనసేన నేతలు కలిశారు. విజయవాడలో ఈసీని కలిసిన వారిలో టీడీపీ నుంచి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బొండా ఉమ, వర్ల రామయ్య, అశోక్ బాబు... జనసేన నుంచి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఏపీలో ఒకేసారి పెద్ద మొత్తంలో ఓట్లు తొలగిస్తున్నారని, ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు.
TDP
Janasena
ECI
Vijayawada
Andhra Pradesh

More Telugu News