Mohan Babu: 'కన్నప్ప' షూటింగ్ న్యూజిలాండ్ లో దిగ్విజయంగా ముగించుకుని భారత్ తిరిగొస్తున్నాం: మోహన్ బాబు

Mohan Babu says Kannappa shooting completed in New Zealand
  • మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం
  • ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం
  • కీలకపాత్రల్లో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్
  • న్యూజిలాండ్ లో చిత్రీకరణ
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప.  ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం న్యూజిలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంది. 

దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా వివరాలు తెలిపారు. "న్యూజిలాండ్ లో... హాలీవుడ్, భారత్ కు చెందిన అతిరథ మహారథులైన నటీనటులతో... థాయ్ లాండ్, న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో మంచు విష్ణు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం" అని మోహన్ బాబు వివరించారు.
Mohan Babu
Kannappa
Manchu Vishnu
New Zealand

More Telugu News