KTR: బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా

BRS swedapatra release postponed tomorrow
  • ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • దీంతో స్వేదపత్రం విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటన
  • వివిధ కారణాల వల్ల స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా
బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా పడింది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము 'స్వేదపత్రం' విడుదల చేస్తామని నిన్న ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల ఇది రేపటికి వాయిదా పడినట్లు పార్టీ వెల్లడించింది. ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ బీఆర్ఎస్ స్వేద‌ప‌త్రాన్ని విడుదల చేయనున్నారు. కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
KTR
Telangana
BRS
Congress

More Telugu News