తల్లిని చూసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా?: దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు
- ఎన్నారై యశ్ ను సీఐడీ అరెస్ట్ చేయడంపై మండిపాటు
- సీఐడీ వైసీపీకి ప్రైవేట్ సైన్యంలా పని చేస్తోందని మండిపాటు
- ఎన్నారైలకు జగన్ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్న
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సీఐడీ పోలీసుల తీరు దారుణంగా ఉందని విమర్శించారు. సీఐడీ అధికారులు వైసీపీకి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టులు పదేపదే చెపుతున్నా సీఐడీకి పట్టదా? అని ప్రశ్నించారు.