Queen Elizabeth II: స్కాట్‌లాండ్‌ ఎస్టేట్‌లో చనిపోతే అంత్యక్రియలు కష్టమవుతాయని క్వీన్‌ ఎలిజబెత్-2 భావించారు: ప్రిన్సెస్ ఏనీ

  • క్వీన్ ఎలిజబెత్ కు స్కాట్‌లాండ్‌లోని 50,000 ఎకరాల ఎస్టేట్ లో భవనం 
  • క్వీన్ ఎలిజబెత్‌ను ఒప్పించి అంత్యక్రియలకు దూరంగా ఉంచామన్న యువరాణి
  • డిసెంబర్ 26న ప్రసారం కానున్న డాక్యుమెంటరీలో ఆసక్తికర విషయాలు పంచుకున్న ఏనీ  
Queen Elizabeth II Was Concerned About Dying In Scotland Says Daughter Anne

స్కాట్‌లాండ్‌లోని ఎస్టేట్‌లో తాను చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడం మరింత సంక్లిష్టమవుతుందని క్వీన్ ఎలిజబెత్-2 ఆందోళన చెందారని ఆమె కూతురు, యువరాణి ఏనీ వెల్లడించారు. ఏర్పాట్లలో తలెత్తే సమస్యల పట్ల ఆమె కలవరం చెందారని, దీంతో అంత్యక్రియలకు సంబంధించిన నిర్ణయాలకు దూరంగా ఉండాలంటూ ఆమెను ఒప్పించామని ఏనీ తెలిపారు. ఈ నెల 26న ప్రసారం కానున్న ఓ డాక్యుమెంటరీలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కాగా 96 ఏళ్ల వయసులో క్వీన్ ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8, 2022న బాల్మోరల్‌లోని స్కాటిష్ హైలాండ్ రిట్రీట్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే.

కాగా స్కాట్‌లాండ్‌లోని 50,000 ఎకరాల (20,000-హెక్టార్లు) ఎస్టేట్‌‌లోని నివాసాన్ని క్వీన్ ఎలిజబెత్-2 అమితంగా ఇష్టపడేవారు. వేసవిలో భర్త ఫిలిప్, కుటుంబంతో కలిసి 2 నెలలపాటు అక్కడే గడిపేవారు. 1852లో క్వీన్ విక్టోరియా కోసం ఆమె భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ ఈ ఎస్టేట్‌‌ను కొనుగోలు చేశారు.

More Telugu News