Akbaruddin Owaisi: బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి చెందింది: అక్బరుద్దీన్ ఒవైసీ

Akbaruddin Owaisi says old city developed under brs government
  • ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలన్న అక్బరుద్దీన్
  • 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే
  • బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిందని వ్యాఖ్య
బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి చెందిందని మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇరవై నాలుగు గంటలు నిరంతర విద్యుత్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుందని, దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. పాతబస్తీలో గత బీఆర్ఎస్ హయాంలో రూ.25 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. 
Akbaruddin Owaisi
BRS
Congress
MIM

More Telugu News