Narendra Modi: జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Modi birthday wishes to Jagan
  • ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగన్
  • జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలన్న మోదీ
  • పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా ముఖ్య నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా జగన్ కు గ్రీటింగ్స్ తెలియజేశారు. 'ఏపీ సీఎం శ్రీ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రికి ఏపీ రాష్ట్ర గవర్నర్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. 

మరోవైపు జగన్ పుట్టిన రోజును వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రక్తదాన శిబిరాలను, అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేస్తున్నారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు.
Narendra Modi
BJP
Jagan
YSRCP

More Telugu News