డప్పు కొట్టడం ఆపండి.. ఈ వీడియో చూడండి.. మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీని మోదీ అవమానించిన వీడియోను షేర్ చేసిన జైరాం రమేశ్
- ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌ను టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అవమానించారంటూ బీజేపీ ఆగ్రహం
- హమీద్ అన్సారీ మతాన్ని ఎత్తిచూపుతూ సాక్షాత్తూ పార్లమెంటులోనే మోదీ అవమానించారన్న జైరాం రమేశ్
- మోదీకి డప్పు కొడుతున్నవారు నీచులు, కపటవాదులు, అవకాశవాదులని ఆగ్రహం
పార్లమెంట్ లైబ్రరీ ఆడిటోరియంలో సాయంత్రం జరిగిన వీడ్కోలు కార్యక్రమంలోనూ మోదీ అదే ‘పాట’ చాలా చక్కగా పాడారని ఎద్దేవా చేశారు. ఇలాంటి అల్ప ప్రధాని, ఆయనకు డప్పు కొట్టేవారు ఇప్పుడు రాజ్యాంగ అధికారులకు అన్యాయం జరిగిపోయినట్టు శోకాలు గుప్పిస్తున్నవారు అత్యంత నీచులు, కపటవాదులు, అవకాశవాదులని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.