108 feet Agarbathi: రామమందిర ప్రారంభోత్సవం కోసం.. 108 అడుగుల అగరబత్తీ తయారీ!

  • అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు
  • కార్యక్రమం కోసం 108 అడుగుల పొడవున్న అగరబత్తీ తయారీ 
  • గుజరాత్‌లోని వడోదరలో ఈ భారీ అగరబత్తీని సిద్ధం చేస్తున్న వైనం
108 feet long incense stick being prepared ahead of Ram Mandirs Pran Pratishtha in Gujarats Vadodara

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం 108 అడుగుల పొడవున్న అగరబత్తీ సిద్ధం చేస్తున్నారు. గుజరాత్‌లోని వడోదరలో ఈ అగరబత్తీని తయారు చేస్తున్నారు.  

ఇక జనవరి 22న నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయోధ్యలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. నగరంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఫేజ్-1 ప్రాజెక్టు ఈ నెలాఖరుకల్లా పూర్తి కానుంది. ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన సప్లిమెంటరీ బడ్జెట్‌లో అయోధ్య అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అయోధ్య కన్సర్వేషన్, డెవలప్మెంట్ ఫండ్‌కు రూ.50 కోట్లు, రామోత్సవ్ 2023-24 కోసం రూ.100 కోట్లు, ఇంటర్నేషనల్ రామాయణ్, వైదిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విస్తరణకు రూ.25 కోట్లు కేటాయించారు.

More Telugu News