నాకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రోజా ఫైర్

I will contest in next elections says Roja
  • ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన జగన్
  • రోజాకు టికెట్ ఇవ్వరంటూ ప్రచారం
  • కొందరు శునకానందం పొందుతున్నారంటూ రోజా మండిపాటు
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఈసారి ఎంత మందికి టికెట్ వస్తుందో? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికే పలువురిని పక్క నియోజకవర్గాలకు మారుస్తూ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్ ఇవ్వరనే ప్రచారం ఊపందుకుంది. 

ఈ నేపథ్యంలో రోజా స్పందిస్తూ... తనకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తూ కొందరు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. వారి ఆశలు ఫలించవని అన్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క చోట పోటీ చేస్తే గెలుస్తామో? లేదో? అనే భయంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని... రెండేసి నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్నారని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Roja
Jagan
YSRCP
Ticket

More Telugu News