Revanth Reddy: నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి... ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోరిన సీఎం

CM Revanth Reddy going to Delhi
  • కాంగ్రెస్ అగ్ర నేతలతో సమావేశం కానున్న రేవంత్ రెడ్డి
  • మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపికపై చర్చించనున్న సీఎం
  • తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాను కోరనున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలను కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక, పార్లమెంటు ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో రేవంత్ చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని కోరుతూ పీఏసీ చేసిన తీర్మానాన్ని హైకమాండ్ కు సీఎం అందించనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ను రేవంత్ కోరినట్టు తెలుస్తోంది. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి... రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.
Revanth Reddy
Congress
Delhi
Narendra Modi
BJP

More Telugu News