LK Advani: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి దూరంగా అద్వానీ, మురళీమనోహర్ జోషి

LK Advani and MM Joshi requested not to come to consecration of Ayodhya Ram temple
  • అద్వానీ, జోషి వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విజ్ఞప్తి చేసిన ట్రస్ట్
  • విన్నపాన్ని అంగీకరించిన సీనియర్ నేతలు
  • దేవెగౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందం
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కారణమైన బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఆలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నారు. వీరి వయసును దృష్టిలో పెట్టుకుని ప్రారంభోత్సవానికి రావొద్దని ఆలయ ట్రస్ట్ కోరింది. ప్రస్తుతం అద్వానీ వయసు 96 సంవత్సరాలు కాగా, మురళీ మనోహర్ జోషి వయసు 89 సంవత్సరాలు.

అద్వానీ, జోషి ఇద్దరూ పెద్ద వయస్కులని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావొద్దని విజ్ఞప్తి చేసినట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది. తమ విజ్ఞప్తిని వారు మన్నించారని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. ఆలయ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని దేవెగౌడ (90)ను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఆహ్వానించినట్టు పేర్కొన్నారు.
LK Advani
Murali Manohar joshi
Ayodhya Ram Mandir

More Telugu News