Nara Lokesh: కేసులకు భయపడి జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై నోరు మెదపడంలేదు: నారా లోకేశ్

  • గాజువాక నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం
  • కూర్మన్నపాలెం వద్ద లోకేశ్ ను కలిసిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు
  • తమను ఆదుకోవాలంటూ వినతిపత్రం అందజేత
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్న లోకేశ్ 
Lokesh assures TDP does not agree to privatise Vizag Steel Plant

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఇవాళ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ను కూర్మన్న పాలెం వద్ద విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్యవేదిక సంఘం ప్రతినిధులు కలిశారు. ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

వినతి పత్రంలోని ముఖ్యాంశాలు

• స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చిన 8,500 మంది నిర్వాసితుల సమస్యలు 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి.
• స్టీల్ ప్లాంట్ కోసం 26 వేల ఎకరాలు తీసుకుని పెదగంట్యాడ, గంగవరం, వడ్లపూడి,     అగనంపూడి పంచాయతీల్లోని 64 గ్రామాలను ఖాళీ చేయించారు.
• భూ యజమానులకు ఎకరాకు రూ.1,250 మాత్రమే అప్పట్లో పరిహారం ఇచ్చారు. చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
• కొన్ని పోరాటాల ద్వారా 5 వేల మంది నిర్వాసితులకు ప్లాంట్ లో ఉద్యోగాలు వచ్చాయి.
• 8 వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చారు... మరో 8,500మందికి ఇవ్వలేదు.
• కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంటును 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని చెబుతోంది. ఇదే జరిగితే నిర్వాసితులు ఘోరంగా నష్టపోతారు.
• మీరు అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థలా కొనసాగించాలి.
• ప్రధాని వద్దకు నిర్వాసితులను తీసుకెళ్లి మా సమస్యల్ని పరిష్కరించాలి.
• మిగిలిపోయిన ఆర్ కార్డుదారులకు ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలి.
• స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ను నమ్ముకుని ఉన్న కాంట్రాక్టు కార్మికులకు పని భద్రత కల్పించాలి... అని విజ్ఞప్తి చేశారు.

నారా లోకేశ్ స్పందిస్తూ...

 • పోరాటాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్నది విశాఖ ఉక్కు కర్మాగారం.
• విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
• 22,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న విశాఖ ఉక్కు విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.3 లక్షల కోట్లకు పైమాటే.
• విశాఖ ఉక్కు ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించింది.
• భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు.
• విశాఖ ఉక్కు ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించింది.
• ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడివడి ఉన్న ఇటువంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థను ప్రైవేటీకరణ చేస్తుంటే కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదు.
• కొందరు బడా పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కవడం ద్వారా ఖాళీగా ఉన్న సుమారు 8 వేల ఎకరాల భూములను అడ్డగోలుగా దోచుకునేందుకు జగన్ వ్యూహరచన చేశాడు.
• 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి జగన్ రెడ్డి కమిషన్ల కోసం, ప్లాంట్ లో వాటాల కోసం ఆరాటపడడం అత్యంత దుర్మార్గం.
• తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంటులో మా గళాన్ని వినిపిస్తాం.
• ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అంగీకరించబోం.
• నిర్వాసితులకు అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపడతాం.
• విశాఖ ఉక్కు మనుగడకు అవసరమైన క్యాప్టివ్ మైన్స్, కాస్ట్ కటింగ్ వంటి అంశాలపై దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలను అందిస్తాం.
• విశాఖ స్టీల్ ఉద్యోగులు, కార్మికుల ఉపాధి భద్రత, సంక్షేమానికి కృషి చేస్తాం.
• విశాఖ ఉక్కు నిర్వాసితులు, ఆర్ కార్డుదారులకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటాం... అని హామీ ఇచ్చారు.

More Telugu News