చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
- ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు
- ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్టులో అక్రమాలంటూ మరో కేసు
- రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ చీఫ్ పిటిషన్
సీఐడీ పెట్టిన ఈ రెండు కేసులలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. నేడు విచారించనుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఈ పిటిషన్లపై విచారణ జరగనున్నట్లు సమాచారం.