Corona Subvariant JN.1: కేరళలో కరోనా కొత్త సబ్ వేరియంట్

  • కేరళలోని 79 ఏళ్ల వృద్ధురాలిలో కొత్త జేఎన్.1 సబ్ వేరియంట్
  • వృద్ధురాలి శాంపిల్‌ను జీనోమిక్స్ కన్సార్షియం పరిశీలించగా సబ్ వేరియంట్ ఉనికి వెల్లడి
  • అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో తొలిసారిగా వెలుగు చూసిన జేఎన్.1 సబ్‌వేరియంట్
  • ప్రస్తుత టీకాలు, చికిత్సలతో జేఎన్.1 నుంచి రక్షణ
New Subvariant JN1 found in kerala

కేరళలో కొత్తగా కొవిడ్-19 జేఎన్.1 సబ్‌వేరియంట్ వెలుగు చూసింది. 79 ఏళ్ల వృద్ధురాలిలో ఈ సబ్‌వేరియంట్ బయటపడింది. భారత సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం నిర్వహించిన పరిశీలనలో వృద్ధురాలు కరోనా కొత్త సబ్ వేరియంట్ బారిన పడ్డట్టు తేలింది. ‘‘నవంబర్ 19న నిర్వహించిన ఆర్టీ‌-పీసీఆర్ పరీక్షలో ఆమెకు కొవిడ్ సోకినట్టు తేలింది. ఆ నమూనాలో జేఎన్.1 సబ్‌ వేరియంట్ ఉన్నట్టు ఈ నెల 8న తేలింది. ఈ సబ్‌ వేరియంట్ తొలిసారిగా ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో వెలుగు చూసింది’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా సహా పలు దేశాల్లో జేఎన్.1 కేసులు పెరుగుతున్నప్పటికీ టీకాలు, చికిత్సలతో ఈ ఉపరకం నుంచి రక్షణ పొందొచ్చు.

More Telugu News