Narendra Modi: ప్రధాని మోదీకి ఇప్పటివరకు 15 అంతర్జాతీయ అవార్డులు... జీవీఎల్ ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రం

  • మోదీకి 2014 నుంచి ఎన్ని అవార్డులు వచ్చాయన్న జీవీఎల్
  • లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
  • మోదీకి14 దేశాల పురస్కారాల పాటు ఐక్యరాజ్యసమితి అవార్డు
Center replies to GVL question how many awards PM Modi received since 2014

ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటివరకు వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఎన్ని అవార్డులు ఇచ్చాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. ప్రధాని మోదీకి 2014 నుంచి ఇప్పటివరకు ఎన్ని అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి అని ఇవాళ రాజ్యసభలో తాను ప్రశ్న అడిగినట్టు జీవీఎల్ వెల్లడించారు. తన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జవాబు చెప్పిందని తెలిపారు. 

మోదీకి ఇప్పటివరకు 14 దేశాల అంతర్జాతీయ అవార్డులతో పాటు ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం కూడా లభించిందని కేంద్రం వివరించిందని జీవీఎల్ తెలిపారు. దీంతో, ప్రపంచ దేశాలు భారత ప్రధాని నాయకత్వాన్ని బలపరిచినట్టు స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు ప్రతులను కూడా జీవీఎల్ తన ట్వీట్ కు జత చేశారు. 


ప్రధాని మోదీకి లభించిన అంతర్జాతీయ పురస్కారాలు ఇవే...

1. సాష్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ (సౌదీ అరేబియా)- 2016 ఏప్రిల్ 3
2. స్టేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్)- 2016 జూన్ 4
3. గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా (పాలస్తీనా)- 2018 ఫిబ్రవరి 10
4. యూఎన్ చాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు (ఐక్యరాజ్యసమితి)- 2018 అక్టోబరు 3
5. ఆర్డర్ ఆఫ్ జయేద్ (యూఏఈ)- 2019 ఏప్రిల్ 4
6. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ (రష్యా)- 2019 ఏప్రిల్ 12
7. ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్ (మాల్దీవులు)- 2019 జూన్ 8
8. కింగ్ హమాద్ ఆర్డర్ ఆఫ్ ద రెనెయిస్సాన్స్ (బహ్రెయిన్)- 2019 ఆగస్టు 24
9. లెజియన్ ఆఫ్ మెరిట్ (అమెరికా)- 2020 డిసెంబరు 21
10. ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్ (భూటాన్)- 2021 డిసెంబరు 17
11. ఆర్డర్ ఆఫ్ ఫిజి (ఫిజి)- 2023 మే 22
12. ఆర్డర్ ఆఫ్ లోగోహు (పాపువా న్యూ గినియా)- 2023 మే 22
13. ఆర్డర్ ఆఫ్ ద నైల్ (ఈజిప్టు)- 2023 జూన్ 25
14. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్ (ఫ్రాన్స్)- 2023 జులై 13
15. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్ (గ్రీస్)- 2023 ఆగస్టు 25

More Telugu News